Domakonda | కామారెడ్డి, బిబిపేట్( దోమకొండ) ఏప్రిల్ 11 : దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి నీ 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ అన్నారు.
దోమకొండ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ చిత్రపటాలకు మండల పార్టీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి, తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ రూ.22 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రాథమిక ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కు అనుసంధానం చేసి 30 పడకల ఆసుపత్రిగా కృషిచేసిన ఘనత షబ్బీర్ అలికి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్రబోయిన స్వామి, రామస్వామి గౌడ్. పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోపాల్ రెడ్డి, సాయిలు నాయకులు నల్ల శ్రీనివాస్, శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, కలీం, షమీ, కొండ అంజుమ్, సిద్ధారెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ గౌడ్, వినీత్ తదితరులు పాల్గొన్నారు