కంఠేశ్వర్, జూన్ 17: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 21 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్ఈ ఆర్ రవీందర్ తెలిపారు. ఉదయం సెక్షన్ సబ్ డివిజన్, సాయంత్రం ఎస్ఈ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించామన్నారు. నిజామాబాద్ డివిజన్లో రెండు, డిచ్‌పల్లిలో ఐదు, ఆర్మూర్‌లో ఐదు, బోధన్‌లో తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్ఈ కార్యాలయం లో రవీందర్, టెక్నికల్ డీఈ వెంకటరమణ, ఎన్ఏవోఎం రాజశేఖర్, కమర్షియల్ ఏడీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంటు కోతలు ఎక్కువగా అవుతున్నాయని ప్రజావాణిలో తెలిపినట్లు సమాచారం