టీఆర్ఎస్ హయాంలోనే ప్రతి పల్లెకూ రోడ్డు : పోచారం సురేందర్‌రెడ్డి

కోటగిరి : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ సర్కారు హయాంలోనే పల్లెపల్లెకూ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని హెగ్డోలి నుంచి యాద్గార్పూర్ మీదుగా పెంటకుర్ధు వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకాగౌడ్, జడ్పీటీసీ శంకర్‌పటేల్, ఎజాజ్‌ఖాన్, ఎంపీటీసీలు ఉమా రాంబాబు, అనంత విఠల్, వాసుబాబు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండల స్థాయి నాయకుల సమావేశం
వర్ని(రుద్రూర్): వర్ని, రుద్రూర్లో టీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు సమావేశాన్ని పోచారం సురేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కుత్బుల్లాపూర్ డివిజన్లో ప్రచారం కోసం స్థానిక నాయకులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రాష్ర్టాన్ని సాధించడానికి కేసీఆర్ తన జీవితాన్నే త్యాగం చేశారని, హైదరాబాద్‌ను సైతం అభివృద్ధి చేసేందుకు ప్రాణాలైనా లెక్క చేయకుండా పనిచేసే తెగింపు ఆయనకు ఉన్నదని తెలిపారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి