శనివారం 30 మే 2020
Nizamabad - Feb 22, 2020 , 04:19:54

తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం

తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం

మెండోరా: శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి కాలువలకు నీటివిడుదల కొనసాగుతుండడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోందని ఏఈఈ మహేందర్‌ తెలిపారు. కాకతీయ కాలువకు 5,835, సరస్వతీ 300, అలీ సాగర్‌ గుత్ప ఎత్తిపోతల పథకాలకు 945, లక్ష్మి కాలువకు 250 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1081.90 అడుగులు (57.793 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. ఆవిరి, లీకేజీ రూపంలో 629 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ తాగునీటి కోసం 142 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్‌ నుంచి ఔట్‌ఫ్లో 8,082 క్యూసెక్కులు పోతున్నదని తెలిపారు. కాకతీయ కాలువ నీటివిడుదలతో జెన్‌కో కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. రెండు టర్బయిన్లతో 21.1 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 36.7335 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పతి జరిగిందని డీఈ శ్రీనివాస్‌ తెలిపారు.


logo