గాంధారి ఆగస్టు 24: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సమావేశానికి హాజరు కాని ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేయాలని కామారెడ్డి అదనపు కలెక్టర్, డీఆర్డీవో వెంకటమాధవరావు గాంధారి ఎంపీడీవో సతీశ్‌ను ఆదేశించా రు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో పాటు ఉపాధి హామీ టీఏలతో వారు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇటీవల జరిగిన ఉపాధిహామీ పనులకు సంబంధించిన రికార్డులు, పనులకు సంబంధించిన మస్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మండలంలో సోమవారం సీఆర్డీ బృందం సభ్యు లు ఏ గ్రామాల్లో పర్యటించారు, ఏ పనులను పరిశీలించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఏపీవో అన్నపూర్ణ, టీఏ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.