ధర్పల్లి, ఫిబ్రవరి 13 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామస్తులకు ఆహ్లాదం పంచేందుకు మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. పచ్చదనం కళకళలాడిన ప్రకృతి వనంగా ఏడాది కాలంగా నిర్వహణ కరువై అధ్వానంగా మారింది. పట్టించుకునే వారే కరువయ్యారు.
ప్రకృతి వనం చెత్తాచెదారంతో నిండిపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘నాడు ఆహ్లాదకరం – నేడు కళావిహీనం’ అనే శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పంచాయతీ అధికారులు పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. సిబ్బందితో కలిసి పల్లెప్రకృతి వనంలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించి ట్యాంకర్ ద్వారా చెట్లు, మొక్కలకు నీళ్లు పట్టించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పర్యవేక్షించి పల్లెప్రకృతి వనాన్ని మళ్లీ సుందరవనంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు