వేల్పూర్/ కోటగిరి/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ బాల్కొండ/భీమ్‌గల్/ నవీపేట, నవంబర్ 3: వేల్పూర్ మండలంలోని పడిగెల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి గురువారం ప్రారంభించి మాట్లాడారు. డీసీవో సింహాచలం, సొసైటీ చైర్మన్ యాల్ల హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ దేవత వర్షిణి రాజకుమార్, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
కోటగిరి మండలంలోని హంగర్గాఫారంలో పొతంగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ఎజాజ్‌ఖాన్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ దయాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు మండవ దిలీప్, శ్రీనివాస్‌రెడ్డి, వలీయొద్దీన్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని జలాల్పూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్చార్జి సర్పంచ్ స్వప్న, ఐకేపీ ఏపీఎం మహేశ్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీలు సంతోష్, భాస్కర్, వీవో సుజాత, వీవోఏ గీతారాణి, డ్వాక్రా సంఘం మహిళలు, రైతులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని గడ్కోల్, మైలారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీటీసీ సభ్యుడు గాండ్ల సతీశ్, ఐకేపీ ఇన్చార్జి ఏపీఎం సత్యానంద్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల రమ్యాసత్యానంద్, దేవాగౌడ్, గంగారాం, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలం కిసాన్‌నగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ, నవీన్‌గౌడ్, వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, వ్యవసాయాధికారి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బద్దం ప్రవీశ్రెడ్డి, ఎంపీటీసీ రాంరాజ్గౌడ్ పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుణ్వీర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, తదితరులు ప్రారంభించారు. సర్పంచ్ అనసూయ, ఎంపీటీసీ ప్రేమల హనుమాన్చారి, ఏవో మౌనిక, ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సబిత ప్రారంభించారు. ఎంపీటీసీ బట్టు రాణి, ఉప సర్పంచ్ గౌరు రాజు(సాయిలు), ఏపీఎం భూమేశ్వర్గౌడ్, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌లో కమ్మర్పల్లి పీఏసీఎస్ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ కొనుగోల కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్ బద్దం పద్మా చిన్నారెడ్డి, ఎంపీటీసీ పిప్పెర అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.