భూ వివాదాల పరిష్కార వేదిక రెవెన్యూ ట్రిబ్యునల్

- ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు
- నిర్మల్ జిల్లాలో 167 పెండింగ్ కేసులు
నిర్మల్ టౌన్, జనవరి 24 : భూ వివాదాలు పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ కోర్టులను సర్కారు ఏర్పా టు చేసింది. నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ డిజిటల్ పాసుపుస్తకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కోర్టులను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా వ్యా ప్తంగా భూ పంచాయతీలకు మోక్షం లభించనుంది. జిల్లావ్యాప్తంగా 2,03,300 రైతు ఖాతాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 1,76,360 ఖాతాలు సక్రమంగా ఉండ గా.. మిగతావి పార్ట్(బీ)వి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకం పెండింగ్, మ్యుటేషన్, సాదా బైనామాలు, పాసుపుస్తకాల్లో తప్పులు, ఆర్వోఆర్ వంటి కేసులు అధికంగా ఉన్నాయి. ఇందులో పార్ట్(బీ) కేసులు 46,471 ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. సాదాబైనామాలు 7,555 ఉండగా.. 8,959.34 ఎకరాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి పరిష్కారమార్గం కొత్తగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌లో దారి చూపనున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ భూముల వివాదాలను పరిష్కరించనున్నారు.
60 రోజుల్లో పూర్తి పరిష్కారమే లక్ష్యం
నిర్మల్ జిల్లాలో భూవివాదాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అధికారులు జిల్లాలోని 18 మండలాలతోపాటు నిర్మల్, భైంసా, ఖానాపూర్ ము న్సిపాల్టీల్లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యక్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో తెలిపిన విషయాలను ఈనెల 31 వరకు మండల రెవెన్యూ, డివిజన్ కార్యాలయాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను గుర్తించి ట్రిబ్యునల్‌కు అందజేయాలని సూచించారు. దీన్ని ఆర్డీవోలు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
మండలాలవారీగా నివేదిక..
మండలాలవారీగా ఉన్న వివిధ కేసుల వివరాలను నివేదికలో అందించనున్నారు. జేసీ పరిధిలో 35 ఆర్వోఆర్, ఆర్డీవో పరిధిలో 63, తహసీల్దార్ల పరిధిలో 69 వివాదాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు..వాటిని సత్వరం పరిష్కరించేలా చర్య లు తీసుకుంటున్నారు. జిల్లాలో అర్హులై ఉన్నప్పటికీ డిజిటల్ రైతుఖాతా పుస్తకాలు రాక రైతు బంధు, బ్యాంకు రుణాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రిబ్యునల్‌లో పరిష్కారంచూపే అవకాశం ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్ తహసీల్ కార్యాలయాల్లో, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రైతులకు పారదర్శకమైన సేవలు అందించేలా చూస్తున్నది. దీంతో జిల్లాలో అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో భూ వివాదాలకు సంబంధించిన ఫైళ్లలో కదలిక ప్రారంభం కావడంతో రైతులకు 60 రోజుల్లోనే పరిష్కారం లభించనుంది.
తాజావార్తలు
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్‌రావు
- సీఎం అల్లుడు, మరో ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
- భారీ ఆఫర్‌కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్‌రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా