శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Jan 11, 2021 , 01:47:19

వడ్యాల్‌ను మండల కేంద్రం చేయాలి

వడ్యాల్‌ను మండల కేంద్రం చేయాలి

  • మంత్రి అల్లోలకు గ్రామస్తుల వినతి

లక్ష్మణచాంద, జనవరి 10 : వడ్యాల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి విన్నవించారు.  వడ్యాల్‌ను మండలంగా ఏర్పాటు చేస్తే మరిన్ని గ్రామాలకు సౌలభ్యంగా ఉంటుందని మంత్రికి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి సోదరుడు సురేందర్‌ రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, సల్ల రాజేంద్ర ప్రసాద్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 10 :  తహసీల్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి  ఆదివారం వినతి పత్రం అందించారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  కంప్యూటర్‌ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అజారుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి మధు, సభ్యులు భీమ్‌ సింగ్‌, చరణ్‌, ఫిర్దోస్‌, జాకీర్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

క్యాలెండర్‌ విడుదల  

నిర్మల్‌ టౌన్‌, జనవరి 10 : బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన -2021 క్యాలెండర్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీధర్‌, రాజు, రవి పాల్గొన్నారు. 


logo