పంట కల్లాలను వేగంగా పూర్తి చేయాలి

నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న పంట కల్లాలను వేగంగా పూర్తి చేయాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. నిర్మ ల్ కలెక్టరేట్లో మంగళవారం పంట కల్లాల ని ర్మాణంపై ఎంపీడీవోలు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, డీఆర్డీఏ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పంట కల్లాలను వేగంగా నిర్మించేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జనవరి 15 వరకు జిల్లాలో ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యాసంగిలో రైతులకు పంట కల్లాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పనులను ఏ రోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శ్మశానవాటికలను పూర్తి చేయాలి
నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామపంచాయతీల్లో నిర్మిస్తున్న శ్మశానవాటికల నిర్మాణాలను వేగం గా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలతో సమావే శం నిర్వహించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి? ఎన్ని గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి? పనుల పురోగతి, నిధుల వినియోగం, తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు.
తాజావార్తలు
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్