ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

- పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై సమీక్ష
నిర్మల్ టౌన్ : జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిపాలన అనుమతి పొందిన వాటికి ఇళ్ల స్థలాలను గుర్తించాలని, టెండర్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఇళ్లు పూర్తయిన ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థలాలు ఉండి నత్తనడకన సాగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్వో రమేశ్ రాథోడ్, జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శంకరయ్య, రోడ్లు భవనాల శాఖ ఈఈ అశోక్‌కుమార్, విద్యుత్‌శాఖ డీఈ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్లు బాలకృష్ణ, కదీర్ ఉన్నారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి