గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 28, 2020 , 02:21:30

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

నిర్మల్‌ టౌన్‌/దిలావర్‌పూర్‌/నర్సపూర్‌(జీ)/సోన్‌/ లక్ష్మణచాంద/ సారంగాపూర్‌/మామడ : 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు దిలావర్‌పూర్‌, నర్సపూర్‌(జీ), సోన్‌, లక్ష్మణచాంద, సారంగాపూర్‌, మామడ మండలాల్లోని  గ్రామాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, ప్ర జా సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీల నాయకులు పార్టీ కార్యాలయాల్లో ఎంపీపీలు , అధికారులు, ఎస్సైలు, పాఠశాలలు, కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు. దళిత సంఘాలు, కుల సం ఘాలు, యువజన సంఘాలు, మున్నూర్‌కాపు సంఘం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జెండా పండుగను నిర్వహించారు. ఏబీవీపీ కావేరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. సహకార సంఘాలు, ఐకేపీ కార్యాలయా లు, పంచాయతీ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ, సహ కార సంఘాల  చైర్మన్లు, రైతు సమన్వయ సమితి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు జెండా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. 


logo
>>>>>>