హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలకు (Group 2 Exams) సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. వచ్చే నెల 9న హాల్టికెట్లను విడుదల చేయనుంది. డిసెంబర్ 9 నుంచి పరీక్ష జరిగే రోజు వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
అయితే.. డీఎస్సీ, గ్రూప్-2 మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో పరీక్షలను వాయిదా పడ్డాయి.వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసి డీఎస్సీని మాత్రం వాయిదా వేయలేదు. యథాతథంగా నిర్వహించారు. ఎంపికైనవారికి నియామకపత్రాలు కూడా అందించారు. ఇక గ్రూప్-2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షలు..
డిసెంబర్ 15- ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
డిసెంబర్ 15- మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2
డిసెంబర్ 16- ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
డిసెంబర్ 16- మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4