శనివారం 27 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 25, 2021 , 09:27:53

ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్‌ ప్రసారాలు

ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్‌ ప్రసారాలు

హైదరాబాద్‌: స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) పోటీ పరీక్షల కోసం టీశాట్‌లో పాఠ్యాశాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో టీ శాట్‌ నెట్‌వర్క్‌లోని నిపుణ, విద్య చానళ్లలో పాఠ్యాంశాలను నేటి నుంచి ప్రసారం చేయనున్నారు. ఇవాళ లైవ్‌ సెషన్‌ నిర్వహిస్తారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీవరకు ఎస్సెస్సీ శిక్షణ అందిస్తామని టీ శాట్‌ సీఈఓ శైలేష్‌రెడ్డి తెలిపారు. పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడుతాయని చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లైవ్‌లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల నివృతి కోసం 040-2354 0326, 2354 0726, టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 4039 నంబర్లలో సంప్రదించవచ్చని తవెల్లడించారు.

జనవరి 27 నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 8 గంటల వరకు పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌, ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, జరల్‌ స్టడీస్‌ అంశాలను బోధిస్తారు. 

వివిధ శాఖల్లోని 12,328 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 6506 పోస్టులను ఎస్సెస్సీ సీజీఎల్‌ ద్వారా, 5522 పోస్టులు సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఈ నియామకాలకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్‌ 12 నుంచి వారం రోజులపాటు  జరుగనున్నాయి. 

VIDEOS

logo