TS POLYCET 2023 Resluts : ఈనెల 26న పాలీసెట్ 2023 ఫలితాలు విడుదల చేయనున్నారు. మసాబ్ ట్యాంక్‌లోని ఎస్బీటెట్ తెలంగాణ, ఎస్వీ భవన్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్టు సీటీఈ చైర్మన్ నవీన్ మిట్టల్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో ఫలితాలు అదుబాటులో ఉంచుతామని తెలిపారు.
మే 17వ తేదీన పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించారు. పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు పాలీసెట్ రాశారు. ఈ సెట్లో ఉత్తీర్ణులైనవాళ్లు నేరుగా ఇంజినీరింగ్, నాన్ – ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాల్లో చదువుకునే వీలుంది. అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సులను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ(PJTSAU), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సీటీ(SKLTSHU)లు అందిస్తున్నాయి.