హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : న్యాయవాద విద్యా కోర్సులకు డిమాండ్ ఏటేటా అధికమవుతున్నది. ఈ సారి మొదటి విడత కౌన్సెలింగ్లోనే ఏకంగా 82% సీట్లు భర్తీ అయ్యాయి. లాసెట్ వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా శుక్రవారం మొదటి విడత సీట్లను కేటాయించారు.
మూడేండ్ల లా కోర్సులో 5,281 సీట్లకు 4,685(88%) సీట్లు, ఐదేండ్ల లా కోర్సులో 2,259 సీట్లకు 1,533(67%) చొప్పున సీట్లు భర్తీ అయ్యా యి. 7,540 సీట్లకు 6,218 సీట్లు నిండటం గమనార్హం. సీట్లు పొందిన వారంతా 4 లోపు రిపోర్ట్చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.