Balakrishna | హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కామారెడ్డితో పాటు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ క్రమంలో బాలకృష్ణ మంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సాయం ప్రకటించారు. కన్నీళ్లను ఎవరూ తుడవలేమన్న ఆయన.. తన వంతుగా సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తి భారీ నష్టాన్ని మిగిల్చాయన్నారు. రైతులతో పాటు ప్రజలు చాలా నష్టపోయారని తెలుసుకొని చింతిస్తున్నానని.. వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు.