హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : టీచర్ల పదోన్నతులతో ఖాళీ ఏర్పడిన సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను వర్క్ అడ్జస్ట్మెంట్ లేదా విద్యా వలంటీర్లతో భర్తీచేయాలని తెలంగాణ ప్రొగ్రెస్సీవ్ టీచ ర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. టీపీటీయూ అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కే సారయ్య శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను సర్దుబాటు లేదా పోస్టింగ్స్ ద్వారా భర్తీచేయాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ కోరింది. సంఘం అధ్యక్షుడు పీ రాజభానుచంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి జీ హేమచంద్రుడు విద్యాశాఖ డైరెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.