Anjali Raghav | అసభ్యంగా నడుమును తాకిన హీరో.. ఇండస్ట్రీని వీడితున్నట్లు ప్రకటించిన హీరోయిన్ అంజలి..!
Anjali Raghav | ఇటీవల భోజ్‌పురి హీరో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తిస్తూ హీరోయిన్ అంజలి రాఘవ్ నడుమును తాకిన విషయం తెలిసిందే. ఈ ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. పలువురు హీరో తీరుపై మండిపడ్డారు. తాజాగా హీరోయిన్ అంజలి రాఘవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Anjali Raghav | ఇటీవల భోజ్‌పురి హీరో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తిస్తూ హీరోయిన్ అంజలి రాఘవ్ నడుమును తాకిన విషయం తెలిసిందే. ఈ ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. పలువురు హీరో తీరుపై మండిపడ్డారు. తాజాగా హీరోయిన్ అంజలి రాఘవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన ఒక పాట ప్రమోషన్ ఈవెంట్లో జరిగిన ఘటనతో మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ‘సైయా సేవా కరే’ పాట ప్రచార కార్యక్రమం సందర్భంగా వేదికపై మాట్లాడుతున్న అంజలి దగ్గరకు హీరో పవన్ సింగ్ వచ్చాడు. ఆమె అనుమతి లేకుండా ఆమె నడుమును తాకాడు. చీరపై ట్యాగ్ ఉందని, దాన్ని తీసేందుకు అలా చేశానని పవన్ చెప్పినట్లు వీడియోలో వినిపించింది. ఆ క్షణంలో అంజలి నవ్వినప్పటికీ, ఆమె ముఖంలో అసౌకర్యం స్పష్టంగా కనిపించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంజలి రెండు రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ తన మనోవేదనను బయటపెట్టారు. ‘నన్నే తప్పు పట్టి మీమ్స్ చేస్తున్నారు. బహిరంగంగా ఎవరో తాకితే దాన్ని ఎవరైనా ఆనందంగా స్వీకరిస్తారా? ఆ సమయంలో కొత్త చీర కావడంతో ట్యాగ్ ఉందేమోనని అనుకున్నాను. కానీ, ఆ తర్వాత ఏమీ లేదని తెలిసి కన్నీళ్లు ఆగలేదు. ఇదేందని నిలదీసేలోగానే పవన్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టంచేశారు. ‘ఎవరి అనుమతి లేకుండా వారిని తాకడం ఎప్పటికీ సమంజసం కాదు. ఇకపై నా కుటుంబంతో కలిసి హర్యానాలోనే జీవిస్తాను’ అంటూ అంజలి ప్రకటించారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. చాలా మంది నెటిజన్లు అంజలి రాఘవ్‌కు మద్దతుగా నిలిచారు.
Anjali Raghav को शायद पता नहीं था पवन सिंह पहले लेते है, फिर काम देते है! 😂🤦♀️🥵 pic.twitter.com/IX14pWNdPi
— कामिनी यादव (@kaminiyadav92) August 30, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

