హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టీటీసీ) కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 2025 లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం శుక్రవారం విడుదల చేసింది.
3,202 మంది అభ్యర్థులకు 3,173 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,131 (98.68%) అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు పేర్కొన్నది.