జీవో-7పై సర్కార్ తర్జనభర్జన
ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయించింది.
- పేరా-12పై ప్రభుత్వం మల్లగుల్లాలు
- సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, మే5 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు నిధులు చెల్లించాక కాలేజీలు ఫీ జు వసూలు చేసుకోవాలనే షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే డీబీ టీ విధానాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పథకాన్ని నిర్వీర్యం చేసేందుకేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు సర్కార్‌పై మండిపడుతున్నాయి. మరోవైపు విద్యార్థులకు చెల్లించిన తరువాతే వసూలు చేసుకోవాలనే షరతుపై కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహించి కోర్టును ఆశ్రయించడంతో జీవో అమలుపై హైకోర్టు స్టే విధించింది. నిధులు ఎప్పుడు చెల్లిస్తారనేదానిపై సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌ను ఆదేశించింది.
దీంతో న్యాయనిపుణులు, అధికారులతో మంగళవారం సచివాలయంలో సమీక్షించింది. జీవో-7లోని పేరా-12పై కోర్టుకు ఏం చెప్పాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. కొత్త వారికి రీయింబర్స్మెంట్ ఎలా ఇవ్వాలి?, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఎలా ఇవ్వాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. సంవత్సరంలో రెండు విడుతల్లో ఇవ్వాలనే అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరును పక్కాగా అమలు చేయాలని, 75 శాతం హాజరుంటేనే ఫీజులు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అడ్మిషన్ పొందిన మూడు నెలల్లో కొంత మొత్తం జమచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పాతబకాయిల చెల్లింపుపై సమావేశంలో చర్చ జరుగనట్టు తెలిసింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

