ముగిసిన ఎప్‌సెట్ పరీక్షలు.. 93శాతం మంది విద్యార్థుల హాజరు
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ఎట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు.
- పది రోజుల్లో వెల్లడికానున్న ఫలితాలు
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ఎట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 93. 38శాతం, ఇంజినీరింగ్ విభాగానికి 93. 58శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెండింటికి కలిపి దాదాపు 20వేల మంది విద్యార్థులు డుమ్మా కొట్టడం గమనార్హం. ఎప్‌సెట్ పరీక్షలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల..
ఎప్‌సెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టిసారించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను జేఎన్టీయూ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీని వెబ్సైట్లో పెట్టారు. విద్యార్థులు ఈ నెల 13న ఉదయం 11:30 గంటల్లోపు అభ్యంతరాలు తెలుపవచ్చు. ఇక ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను మంగళవారం విడుదల చేస్తారు. ఈ నెల 14న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

