బుధవారం 21 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 18, 2020 , 13:47:48

ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు.. ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు.. ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో బ్యాంక్ అయిన భార‌తీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు వ‌చ్చేనెల 8 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో (sbi.co.in) ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. అయితే ఈ పోస్టుల‌ను ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా అనుభ‌వం ఆధారంగా, ఇంట‌ర్వ్యూల ద్వారా భ‌ర్తీ చేయ‌‌నున్న‌ది. 

మొత్తం పోస్టులు: 92

ఇందులో డిప్యూటీ మేనేజ‌ర్ (సెక్యూరిటీ)-28 పోస్టులు, మేనేజ‌ర్ (రిటైల్ ప్రొడ‌క్ట్స్‌)-5, డాటా ట్రెయిన‌ర్-1, డాటా ట్రాన్స్‌లేట‌ర్‌-1, సీనియ‌ర్ క‌న్స‌ల్టంట్ అన‌లిస్ట్‌-1. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఎంట‌ర్‌ప్రైజ్, టెక్నాల‌జీ ఆర్కిటెక్చ‌ర్‌)-1, డాటా ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్‌-1, డిప్యూటీ మేనేజ‌ర్ (డాటా సైంటిస్ట్‌)-11. మేనేజ‌ర్ (డాటా సైంటిస్ట్‌)11, డెప్యూటీ మేనేజ‌ర్ (సిస్ట‌మ్ ఆఫీస‌ర్‌)-5, రిస్క్ స్పెష‌లిస్ట్- 19, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెష‌లిస్ట్‌- 3, పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌-5

అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. వ‌య‌స్సు 25 నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్లు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 18

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 8

వెబ్‌సైట్‌: www.sbi.co.in


logo