సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 28, 2020 , 15:20:38

'ఆర్ఆర్బీ ఎన్టీపీసీ' స్టేట‌స్ చెక్ చేసుకోవ‌డానికి ఈనెల 30 వ‌ర‌కు గ‌డువు

'ఆర్ఆర్బీ ఎన్టీపీసీ' స్టేట‌స్ చెక్ చేసుకోవ‌డానికి ఈనెల 30 వ‌ర‌కు గ‌డువు

న్యూఢిల్లీ: ఆర్ఆర్బీ ఎన్‌టీపీసీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల అప్లికేష‌న్ స్టేట‌స్‌ను ఈ నెల 30 వ‌ర‌కు చెక్‌చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రారంభంకానున్న ఈ ప‌రీక్ష‌ల‌కు హాల్‌టికెట్ల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని, అడ్మిట్ కార్డుల‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. 35,208 నాన్-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ పోస్టుల (ఎన్టీపీసీ) భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల కోసం దేశ‌వ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 

మొత్తం 35,208 పోస్టుల్లో 10,628 పోస్టులు 10+2 అర్హ‌త క‌లిగిన జూనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, అకౌంట్స్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, జూనియ‌ర్ టైమ్ కీప‌ర్‌, ట్రైనీస్ క్ల‌ర్క్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టికెట్ క్ల‌ర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. మ‌రో 24,49 పోస్టులు డిగ్రీ అర్హ‌త‌తో ఉన్న‌వి ఉన్నాయి. కంప్యూట‌ర్ ఆధారిత‌ ప‌రీక్షలో చూపిన ప్ర‌తిభ ఆధారంగా ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. 


logo