Degree Admissions | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ప్రభుత్వ అటానమస్ కాలేజీలదే హవాగా సాగుతున్నది. ఈ కాలేజీల్లోనే అత్యధికంగా విద్యార్థులు చేరారు. సీట్లు కూడా ఈ కాలేజీల్లోనే అధికంగా నిండుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అటానమస్ కాలేజీల్లో 25,808 మంది విద్యార్థులు చేరారు. వీరు 29 డిగ్రీ కాలేజీల్లోనే చేరడం గమనార్హం.
ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 124 ఉంటే వీటిల్లో చేరింది 24,794 మంది విద్యార్థులే. న్యాక్ గుర్తింపు ఆధారంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా కల్పిస్తున్నారు. అటానమస్ కాలేజీ అయిన సిటీ కాలేజీలోనే ప్రస్తుతం మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీలోనూ దాదాపు ఫస్టియర్లో 1,680 మంది విద్యార్థినులు చేరారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ యాజమాన్యంలోనే అటానమస్ కాలేజీలు ఉన్నాయి. 29 ప్రభుత్వ అటానమస్ కాలేజీలుంటే, 3 ఎయిడెడ్, 4 ప్రైవేట్ అటానమస్ డిగ్రీ కాలేజీలున్నాయి. మరో రెండు యూనివర్సిటీ అటానమస్ కాలేజీలు కూడా ఉన్నాయి. వీటిల్లోనూ అడ్మిషన్లు గణనీయంగానే ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభంకానుంది. ఈ ఏడాది కూడా విద్యార్థులు అటానమస్ కాలేజీల్లోనే చేరే అవకాశం కనిపిస్తున్నది.
పరిస్థితులిలా..