హైదరాబాద్, జూన్ 11 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు వి డుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,98,459 మంది పరీక్షలు రాయగా 2,48,681 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్ట్ ఇయర్లో 68.84 శాతం, సెకండియర్లో 49.29 శాతం ఉత్తీర్ణుల య్యారు. మొదటి సంవత్సరంలో బాలికలు 76.10 శాతం, బాలురు 62. 57 శాతం పాసయ్యారు.
రెండో సంవత్సరంలో బాలికలు 52.56 శాతం, బాలురు 47.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉదయం 11:30కు విడుదల చేసిన ఫలితాలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ గైర్హాజరయ్యారు. కానీ మధ్యాహ్నం తానే ఫలితాలు రిలీజ్ చేసినట్లు ఫొటో మీడియాకు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.