హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఐసీఎస్ఈ(పదో తరగతి), ఐఎస్సీ(12వ తరగతి) ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ బోర్డు గురువారం విడుదల చేసింది.
ఫలితాలను http://www.cisce.org వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని కోరింది. ఐసీఎస్ఈలో 99.80% మంది ఉత్తీర్ణత సాధించగా, ఐఎస్సీలో 99.14% మంది ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించింది.