శనివారం 23 జనవరి 2021
Nipuna-education - Nov 09, 2020 , 14:34:38

ఐసీఎమ్మార్‌లో 80 అసిస్టెంట్ పోస్టులు

ఐసీఎమ్మార్‌లో 80 అసిస్టెంట్ పోస్టులు

న్యూఢిల్లీ: భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌)లో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, ఆర్హ‌త‌ క‌లిగిన భ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 80 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 3 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.  

మొత్తం పోస్టులు: 80

అర్హ‌త‌: గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 30 ఏండ్ల లోపు వయ‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత రాత‌ప‌రీక్ష‌

దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.1500, ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.1200, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.  

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 3

అడ్మిట్ కార్డుల విడుద‌ల‌: డిసెంబ‌ర్ 21‌

ప‌రీక్ష తేదీ: 2021, జ‌న‌వ‌రి 3

వెబ్‌సైట్‌: www.icmr.gov.in  


logo