హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 20నుంచి 23వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించను న్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి తెలుగు వర్సిటీలో ఉదయం 10:30 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను https://www.tspsc.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు వెబ్ఆప్షన్లు ఎంపికచేసుకోవచ్చని సూచించారు. వెబ్ఆప్షన్ల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు.