AICTE సర్వే.. ఇంజినీరింగ్ పిల్లలు లెక్కల్లో పూర్
Engineering | ఇంజినీరింగ్ విద్యార్థులకు లెక్కలు రావట్లేదట. ఇంజినీరింగ్ సబ్జెక్టుల కన్నా కూడా గణితం సబ్జెక్టు నేర్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో ఇంజినీరింగ్ విద్య నాణ్యతపై
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ విద్యార్థులకు లెక్కలు రావట్లేదట. ఇంజినీరింగ్ సబ్జెక్టుల కన్నా కూడా గణితం సబ్జెక్టు నేర్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో ఇంజినీరింగ్ విద్య నాణ్యతపై అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) ఓ సర్వే చేపట్టింది. నేర్చుకోవడంలో ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఎలా గండికొడుతున్నాయో ఈ సర్వే ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేసింది.
1.23 లక్షల మందిపై సర్వే..
దేశంలోని ఏఐసీటీఈ గుర్తింపు పొందిన 2,003 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 1.29 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరందరికీ ప్రాథమిక సబ్జెక్టుల్లో ‘పరాఖ్’ పేరిట ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టగా, రెండు, మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు వారి బ్రాంచికి చెందిన సబ్జెక్టులో టెస్టు పెట్టారు. ఆప్టిట్యూడ్ పరీక్ష కూడా నిర్వహించారు. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశాల్లో కూడా పరిజ్ఞానాన్ని పరిశీలించారు.

వెనుకబడ్డ సివిల్ విద్యార్థులు..
22,725 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు గణితం సబ్జెక్టులో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సర్వేలో తేలింది. గణితంలో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సరాసరి 37.48 శాతం స్కోర్ సాధించి అట్టడుగున ఉన్నారు. గణితంలో రెండో సంవత్సరం విద్యార్థులు మెరుగ్గా ఉన్నారని తేలింది. అదే మూడు, నాలుగో సంవత్సరాల విద్యార్థులు మాత్రం కాస్త వెనుకంజ వేశారని గుర్తించారు. కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కీలకంగా చూసే ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ విషయంలో చాలా తక్కువ దృష్టిపెడుతున్నారని సర్వేలో వెల్లడైంది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

