హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కోర్సు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) ట్రెయినింగ్ కోర్సు
కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు
అర్హతలు: కనీసం 40 శాతం మార్కులతో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. పాస్ మార్కులతో ఏఎన్ఎంలో రిజిస్టర్ అయి ఉండాలి. ఓపెన్ స్కూల్లో చదివిన వారు కూడా అర్హులే.
వయస్సు: 2021, డిసెంబర్ 31 నాటికి 17-35 ఏండ్ల మధ్య ఉండాలి.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో నర్సింగ్ సీట్ల వివరాలు
ఉస్మానియా జనరల్ హాస్పిటల్-62, గాంధీ హాస్పిటల్- 62, వరంగల్ ఎంజీఎం- 62, బోధన్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్-27, కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రి- 42, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్- 32 సీట్లు ఉన్నాయి.
నోట్: వీటితో పాటు రాష్ట్రంలో 158 నర్సింగ్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 13
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ:
డిసెంబర్ 18
వెబ్సైట్:https://dme.telangana.gov.in