నాగర్‌కర్నూల్ రూరల్, ఫిబ్రవరి 9 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని 13వ వార్డుకు చెందిన నీలంటి మహేశ్ బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు. చివరి రోజు ప్రచారం ముగించుకొని ఇంటివద్ద ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు రాళ్లతో దాడిచేశారు. దీంతో మహేశ్‌కు తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.