న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన 12వ తరగతి తుది ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం ఉదయం విడుదల చేసింది. మొత్తం 14 లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాయగా 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 94.54 శాతం మంది అమ్మాయిలు ఉండగా, 91.25 శాతం మంది బాలురు ఉన్నారు. విద్యార్థులు తమ స్కోర్ కార్డులను cbse.gov.in, results.cbse.nic.in వెబ్సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా, టర్మ్-1, టర్మ్-2 పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులను సీబీఎస్ఈ విడుదల చేస్తుంది. టర్మ్-2 పరీక్షలను ఏప్రిల్ 26, జూన్ 4 మధ్య నిర్వహించింది. ఈ ఏడాది సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలను 21 లక్షల మంది రాయగా, 12వ తరగతి పరీక్షలకు 14 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
CBSE Class 12 results | Girls outshine boys with overall pass percentage of 94.54%, while boys secured 91.25% pic.twitter.com/cZqXQEyfAp
— ANI (@ANI) July 22, 2022