study in UK | విదేశాల్లో చదవాలని అనుకుంటున్నారా? అమెరికా కంటే యూకే బెటర్.. కారణమిదే

study in UK | విదేశీ చదువులంటేనే గుర్తుకొచ్చే దేశం అమెరికా. అత్యధికుల కలల సౌధం యూఎస్. కానీ, ఇదంతా గతం. ఇప్పుడు విద్యార్థుల ఆలోచన మారింది. అత్యధికులు యూకేలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా 40 శాతం విద్యార్థులు బ్రిటన్‌లో చదవాలనుకుంటున్నారు. అదే అమెరికాలో విద్యాభ్యాసం కోసం 35 శాతం మంది ఆసక్తిచూపుతున్నారు. ఆ తర్వాతి వరుసలో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు నిలిచాయి. ఇలాంటి ఆసక్తికర విషయాలు సనమ్ ఎస్ 4 సర్వేలో వెలుగుచూశాయి. నవంబర్ 2-14 తేదీల్లో తర్వాత 15 -28 తేదీల మధ్యకాలంలో ఆ సంస్థ సర్వేలు నిర్వహించింది. సర్వేల్లో అత్యధికులు యూకేలోనే చదవాలనుకుంటున్నట్టు అభిప్రాయపడ్డారు.
యూకేలో ఉన్న అనుకూలతలివి..
యూకేలో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలున్నాయి. మిగిలిన దేశాలతో పోల్చితే ఈ దేశంలో తక్కువ వ్యవధిలోనే యూజీ, పీజీ ప్రోగ్రాములు పూర్తిచేయవచ్చు. ట్యూషన్ ఫీజులు సైతం తక్కువ. యూఎస్‌లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులుంటే.. యూకేలో మూడేండ్ల కోర్సులనే నిర్వహిస్తున్నారు. పీజీ కోర్సులు యూఎస్‌లో రెండేండ్లు ఉండగా.. యూకేలో ఏడాదిలోనే పూర్తిచేయవచ్చు. ఇలాంటి అనుకూలతతోనే విద్యార్థులు యూకే వైపు ఆసక్తి చూపుతున్నారు.

విదేశీ చదువుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు
- 71% ఎంట్రీ, దరఖాస్తు సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నామన్నవారు
- 57% విసా సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు
- 50% కోర్సుల కాలవ్యవధి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నవారు
- 36%పెండింగ్, ఫీజు రీఫండ్ సమస్యలు ఎదుర్కొంటున్నవారు
- 36% కొనసాగింపు విజ్ఞప్తులు చేసుకుంటున్నవారు
- 14% ఫలితాలు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నవారు
- 7% ఆన్లైన్క్లాసులతో ఇబ్బందులు పడుతున్నామన్నవారు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
ఓయూలో సరికొత్త కోర్సులు.. యోగాపై డిస్టన్స్ ఎడ్యుకేషన్.. ఇంకా వినూత్న కోర్సులు
గేట్ వే టు కార్పొరేట్ జాబ్స్
ఆ నలుగురూ..: అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. వెండితెరపై పాటలతో అదరగొడుతున్నారు..!!
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

