గేట్ వే టు కార్పొరేట్ జాబ్స్
టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్

సాధారణ కాలేజీల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చదువుతున్నాం ప్లేస్‌మెంట్స్ లేవని బాధపడుతున్నారా? ఫ్రెషర్స్.. తమ స్కిల్ లెవల్ తెలుసుకుని వాటిని పెంచుకోవాలనుకుంటున్నారా? కార్పొరేట్ జాబ్స్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా వీటన్నింటికి సమాధానం.. జాతీయ స్థాయిలో టీసీఎస్ నిర్వహించే నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ). ప్రతిభగల విద్యార్థులు ఎక్కడున్నా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడం సులువు. మారుతున్న ట్రెండ్‌తో కొన్నేండ్లుగా టాప్ ఐటీ కంపెనీలు క్యాంపస్ప్లేస్మెంట్స్కు బదులు ఆయా కంపెనీలే ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి. దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2018 నుంచి జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. 2021 డిసెంబర్, మార్చి 2022కు సంబంధించి నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..
టీసీఎస్ అనుబంధ వ్యూహాత్మక సంస్థ అయిన టీసీఎస్ అయాన్ ఎన్‌క్యూటీ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా పలు కార్పొరేట్ సంస్థల్లో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్లను చేపడుతారు.
ఈ టెస్ట్‌లో ఎంట్రీ లెవల్ జాబ్స్‌కు కంపెనీలు అభ్యర్థి నుంచి ఆశించే సంబంధిత కాగ్నిటివ్ ఎబిలిటీస్‌ను ఈ ఎన్‌క్యూటీలో పరీక్షిస్తారు.
ఈ పరీక్షలో ప్రతి అభ్యర్థి ప్రతిభను గుర్తించే విధంగా పరీక్ష విధానం ఉంటుంది.
అభ్యర్థులు ఆయా అంశాల్లో తమ నాలెడ్జ్‌ను నిరూపించుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. దీనిలో కాగ్నిటివ్ స్కిల్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఐటీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ, ఐటీ ప్రోగ్రామింగ్, అకౌంటెంట్, ఎంఎల్, ఏఐ తదితర అంశాలున్నాయి.
ఈ పరీక్షలో అభ్యర్థి జనరల్ ఎబిలిటీస్, వెర్బల్, న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీస్లను పరీక్షిస్తారు. వీటన్నింటిని నార్మలైజ్డ్ ఎన్‌క్యూటీ స్కోర్‌ను ఇస్తారు. ప్రతి ఏటా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా పరీక్షలో ప్రమాణాలను పెంచుతుంటామని టీసీఎస్ ప్రకటించింది.
ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌కు రెండేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది.
ఈ పరీక్షకు రెండేండ్ల వరకు అనుభవం ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్‌తోపాటు ప్రీ ఫైనల్/ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఏ స్ట్రీమ్‌కు చెందినవారైనా) విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ చేసిన వారు అర్హులు.
ఈ పరీక్ష ఐటీ, బీఎఫ్ఎస్ఐ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ (టీసీఎస్‌తో సహా) కంపెనీల్లో రిక్రూట్మెంట్కు సింగిల్ విండో పరీక్షగా దీనిని పరిగణిస్తున్నారు.
ఈ పరీక్షను అభ్యర్థులు వారి ఇంటి నుంచే రాయవచ్చు. ఒకవేళ పరీక్షకు అవసరమైన సౌకర్యాలు లేకుంటే దగ్గరలోని టీసీఎస్ అయాన్ సెంటర్లో రాయవచ్చు.
ప్రతి మూడు నెలలకోసారి ఎన్క్యూటీని టీసీఎస్ నిర్వహిస్తుంది.
- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

