సిరాజ్ నా దోస్తే.. కానీ తప్పలేదు: గిల్
తనకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడైన పేసర్ సిరాజ్‌ను తొలి టెస్టులో బెంచ్‌పై కూర్చోబెట్టడం ఎంతో కఠినమైన నిర్ణయమని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. వ్యక్తిగత స్నేహం కంటే జట్టు అవసరాలు, బౌలర్ల ప్రస్తుత ఫామ్‌కే ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందని మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు.
తనకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడైన పేసర్ సిరాజ్‌ను తొలి టెస్టులో బెంచ్‌పై కూర్చోబెట్టడం ఎంతో కఠినమైన నిర్ణయమని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. వ్యక్తిగత స్నేహం కంటే జట్టు అవసరాలు, బౌలర్ల ప్రస్తుత ఫామ్‌కే ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందని మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు. ‘సిరాజ్ గొప్ప ఆటగాడు, భారత్ తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. అంతకంటే ముందు అతడు నాకు చాలా మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి అరంగేట్రం చేశాం.
అంతకుముందు నుంచే మంచి స్నేహితులం. అందుకే అతడిని పక్కనపెట్టడం నాకు చాలా కష్టమైంది. కానీ కొన్నిసార్లు ఎవరు ఫామ్‌లో ఉన్నారు, ఎవరు అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నారో చూడాల్సి ఉంటుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే సిరాజ్‌తో వ్యక్తిగతంగా మాట్లాడి ఈ విషయం చెప్పాను. ప్రతి ఆటగాడి కెరీర్లో అత్యుత్తమ ఫామ్ లేని దశ వస్తుంది. సిరాజ్ దీన్ని అర్థం చేసుకుంటాడు. కష్టపడి మళ్లీ జట్టులోకి తిరిగి రావాలనే తపన అతడిలో ఎప్పుడూ ఉంటుంది’ అని గిల్ తెలిపాడు. వెల్లింగ్టన్ పిచ్‌పై సిరాజ్, జడేజా బౌలింగ్ చేస్తే ఫలితం మరోలా ఉండేదని తాను భావించడం లేదని స్పష్టం చేశాడు. పిచ్ స్వభావాన్ని బట్టి రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక ఉంటుందని గిల్ చెప్పాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

