BOB | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్దదైన బ్యాంక్ ఆఫ్ బరోడా 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం (జనవరి 17)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హతలు ఉండీ ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/లో అప్లయ్ చేసుకోవచ్చు. రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లియేబిలిటీస్, ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు..
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్డీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు- 150 మార్కులు) ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. ఈ పరీక్షలను హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలోనూ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100
దరఖాస్తులు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 17
వెబ్సైట్: www.bankofbaroda.in