న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవన్నీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
మొత్తం పోస్టులు: 65
ఇందులో రెజ్లింగ్, కరాటే, వుషు, తైక్వాండో, జూడో, జిమ్నాస్టిక్స్ (పురుషులు), స్కీ, బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీ, ఐస్ హాకీ (పురుషులు) కేటగిరీలో పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: మెట్రిక్యులేషన్ (పదో తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుచుకొని, 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జూలై 5
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
వెబ్సైట్: recruitment.itbpolice.nic.in