e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News స‌గం కూలిన 12 అంత‌స్తుల బిల్డింగ్‌ను పేల్చేశారు..

స‌గం కూలిన 12 అంత‌స్తుల బిల్డింగ్‌ను పేల్చేశారు..

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం 12 అంత‌స్తుల భ‌వ‌నం ఒక‌టి స‌గం కూలిన విష‌యం తెలిసిందే. బిల్డింగ్ కూలిన ఘ‌ట‌నలో 24 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. ఇంకా 121 మంది ఆచూకీ లేదు. అయితే ఆ బిల్డింగ్‌కు చెందిన మ‌రో భాగాన్ని.. ఆదివారం పేలుడు ప‌దార్ధాలు పెట్టి కూల్చేశారు. ఫ్లోరిడాలోని స‌ర్ఫ్‌సైడ్‌లో ఉన్న ఆ బిల్డింగ్ ఇటీవ‌ల అక‌స్మాత్తుగా కూలింది. ఆ ఘ‌ట‌న‌లో 150 మంది వ‌ర‌కు మిస్సైయ్యారు. ఆ ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లాన్ని అధ్య‌క్షుడు జో బైడెన్ కూడా విజిట్ చేశారు. ఇటీవ‌లే ఆయ‌న మృతుల‌కు నివాళి అర్పించారు. అయితే కూలిన శిథిలాల నుంచి మృత‌దేహాల‌ను వెలికి తీయాలంటే.. అక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న సగం బిల్డింగ్‌ను కూల్చాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ఆ బిల్డింగ్‌లో మిగిలిన భాగాన్ని నియంత్రిత ప‌ద్ధ‌తిలో పేల్చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana