తాండూర్ : రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ( Wrestling Competitions ) మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థినిలు ( ZPHS Students ) ఎంపికైనట్లు పీడీ ఏ సాంబమూర్తి తెలిపారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి రెజ్లింగ్ అండర్-14 62కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన పి అశ్విత ,అండర్-17 42 కేజీ విభాగంలో చౌల్ల హర్షిత , 72కేజీ విభాగంలో కే శ్రీవల్లి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు.
35కేజీ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన ఎన్ నిత్య ప్రసన్న , 45కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన బి రమాదేవి , 38కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన జి అజయ్ ఎంపికయ్యారని తెలిపారు. మెడల్స్, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి ఉమాదేవి, ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, వార్డు సభ్యులు దాగం పాపయ్య, నాయకులు మారిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించారు.