అమరావతి : వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దేవాలయంలో నిర్వహించిన కలశ శంకుస్థాపన, సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అంతకు ముందు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలసు ఆయన ప్రారంభిస్తారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఓబుళరెడ్డి శ్రీరాంరెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.