బంజారాహిల్స్,నవంబర్ 17: ఆర్థిక సమస్యలతో పాటు డిఫ్రెషన్ కారణంగా యువకుడు ఆత్యహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కోనసీమ జిల్లా పోలవరం ప్రాంతానికి చెందిన పి.జానకిరామరాజు(29)జూబ్లీహిల్స్ రోడ్ నెం 10(సి)లోని ఓ బోటిక్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతితో ప్రేమలో పడిన జానకిరామరాజు గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నాడు.
దీనికి తోడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో వారంరోజులుగా డిఫ్రెషన్లో పడిపోయిన జానకిరామరాజు సోమవారం ఉదయం గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సోదరుడు వెంకటపతి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.