హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలు కావడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంబంధిత కారు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.