రామగిరి, మార్చి 20 : నల్లగొండ నియోజకవర్గంలో 2వేల మంది నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ముందుకు రాగా.. అభ్యర్థుల ఎంపికకు ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు అనూహ్య స్పందన లభించింది. పట్టణ శివారులోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పరీక్షకు సుమారు ఏడు వేలకు పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యం లో ఆదివారం ఎన్జీ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,500మంది హాజరుకాగా 33 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 416మందిని ఎంపిక చేశారు.