హైదరాబాద్ : నాన్ టీచింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నెల 7న యూనివర్సిటీలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఇరవై ఏండ్లుగా వర్సిటీలో 1117 మంది ఉద్యోగులు చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నామన్నారు. మాకు ఎలాంటి భద్రత, బెనిఫిట్స్ లేకుండా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి రెగ్యులైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ నాచ్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యారాల రాజేష్, జనరల్ సెక్రటరీ ఎ. అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కన్వీనర్ డా.వీరేశం, కోకన్వీర్ సి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.