యాదగిరి గుట్ట, యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి 21 రోజుల పాటు వచ్చిన హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ అధికారులు (Temple Officers ) లెక్కించారు. మొత్తం కోటి 64లక్షల 34,524 రూపాయలు వచ్చిందని కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.
మిశ్రమ బంగారము 86 గ్రాములు, మిశ్రమవెండి రెండు కిలోల 750 గ్రాములు వచ్చిందని వివరించారు. అదేవిధంగా వివిధ దేశాలకు చెందిన రూపాయలను భక్తులు హుండీలో కానుకలుగా వేశారని వెల్లడించారు. అమెరికాకు చెందిన 2368 డాలర్లు, యూఏఈకి 35 దిరామ్స్ , రియల్స్ 11 , ఆస్ట్రేలియా -25 డాలర్స్, కెనడా – 20 డాలర్స్, కతార్ 13 , యూరోప్ 30 , కువైట్ 11, మలేసియాకు చెందిన ఒకటి, వియత్నానానికి చెందిన 70,000 వేల రూపాయలను స్వామివారికి సమర్పించారని వివరించారు.
అదేవిధంగా ఇంగ్లాండ్ 20 , సింగపూర్ 2 , భూటాన్ 3 , నేపాల్ 100 , ఫ్రాన్స్ 20 , ఈస్ట్ ఆఫ్రికా నుంచి 100 కరెన్సీనోట్లు హుండీలో స్వామివారికి సమర్పించుకున్నారని కార్యనిర్వహణాధికారి తెలిపారు.