యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కొండ పైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతుడికి పంచామృతాలలో అభిషే కం, సింధూరం అలకంరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు.
వేద మంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు.