యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 4,12,085 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 27,726, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 11,000, వేద ఆశీర్వచనం ద్వారా 516, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,400, వ్రత పూజలతో 4,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 5,400,
ప్రసాద విక్రయం ద్వారా 1,75,970, వాహన పూజల ద్వారా 4,300, టోల్ గేట్ ద్వారా 720, అన్నదాన విరాళం ద్వారా 2,733, సువర్ణ పుష్పార్చన ద్వారా 52,120, యాదరుషి నిలయం ద్వారా 20,950, పాతగుట్ట నుంచి 11, 950, ఇతర విభాగాల ద్వారా 62,984 మొత్తంగా ఖజానాకు రూ.4,12,085 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.