యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఆలయ గోపురం బంగారు తాపడం కోసం భక్తులు కానుకలు సమర్పిం చేందుకు ఆలయ అధికారులు మరో ముందడుగు వేశారు. స్వామి వారి బ్యాంకు ఖాతాకు చెందిన ఆన్లైన్ క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు సంగతి విధితమే. స్వామి వారికి సమర్పించేందుకు యాదగి రిగుట్ట బ్రాంచ్‌కు చెందిన ఇండియన్ బ్యాంకు ఖాతా నంబర్‌ను అందుబాటులో ఉంచారు. దీంతో భక్తులు బ్యాంకు ఖాతా లోకి తమ విరాళాలు సమర్పిస్తూ వస్తున్నారు.
మొబైల్ ఫోన్ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని వారికి సైతం క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. భక్తులు తమ ఫోన్లలోని గూగుల్, ఫోన్‌ఫే, పేటీఎంల ద్వారా క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి, తమ కానుకలను సమర్పించుకోవాలని సూచించారు. బుధవారం వరకు బంగా రు తాపడం నిమిత్తం స్వామి వారి ఇండియన్ బ్యాంకు ఖాతాలోకి రూ. 1,06,14,315 నగదు జమ అయినట్లు తెలిపారు.
విదేశీ భక్తుల విరాళాల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకున్నామని, త్వరలో మంత్రుల చేతులమీదుగా ప్రారంభించి వివరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. బంగారు కానుకలు, నగదు విరాళాలను స్వీకరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసకుంటున్నామని అన్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
నేడు యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి విరాళాలు అందజేత
యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబసభ్యులు రూ. 50 లక్షలు, మేడ్చల్ నియోజవకర్గం ప్రజలు, ప్రజాప్రతినిధులు రూ. 80 లక్షలు కలిపి మొత్తం రూ.1.30 కోట్లు నేడు స్వామి వారికి అందజేయనున్నారు. మొదటగా కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపడతారు. అనంతరం విరాళాలను ఆలయ ఈవోకు అందజేయనున్నారు.