TVK Vijay | త్రిషను వదిలిపెట్టి ఇల్లు చక్కదిద్దుకో.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
TVK | తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్(Actor Vijay )ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి.
Nainar Nagendran | తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్(Actor Vijay )ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ తన పార్టీకి, డీఎంకేకు మధ్యే ఉంటుందని, బీజేపీ వంటి పార్టీలు రేసులో లేవని విజయ్ చేసిన వ్యాఖ్యలపై నాగేంద్రన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ, విజయ్ ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలని, నటి త్రిష(Actor Trisha)తో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే ఆయనకు రాజకీయ వాస్తవాలు తెలుస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కు రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదని, ఆయన కేవలం సినిమాల్లో డ్యాన్సులు వేసుకోవడానికే పరిమితమని ఎద్దేవా చేసిన నాగేంద్రన్, రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు. రాజకీయ విమర్శలు చేయాల్సింది పోయి, ఒక నటుడి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విజయ్ అభిమానులు మరియు టీవీకే శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.
Why national parties are struggling in Tamil Nadu!
Had Jayalalitha been his boss, for this press meet, Nainar Nagendran would have gotten fired by now, stripped off all his posts and expelled from the party.
Leadership matters and Tamil people always adore leaders who act.
— Dr. Praveen Vijaykumar (@DrPraveenwrites) February 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

